Read Romance books for free


A big variety of genres offers in worldlibraryebook.com. Today we will discuss romance as one of the types books, which are very popular and interesting first of all for girls. They like to dream about their romantic future rendezvous, about kisses under the stars and many flowers. Girls are gentle, soft and sweet. In their minds everything is perfect. The ocean, white sand, burning sun….He and she are enjoying each other.
Nowadays we are so lacking in love and romantic deeds. This electronic library will fill our needs with books by different authors.


What is Romance?


Reading books RomanceReading books romantic stories you will plunge into the world of feelings and love. Most of the time the story ends happily. Very interesting and informative to read books historical romance novels to feel the atmosphere of that time.
In this genre the characters can be both real historical figures and the author's imagination. Thanks to such historical romantic novels, you can see another era through the eyes of eyewitnesses.
Critics will say that romance is too predictable. That if you know how it ends, there’s no point in reading it. Sorry, but no. It’s okay to choose between genres to get what you need from your books. But in romance the happy ending is a feature.It’s so romantic to describe the scene when you have found your True Love like in “fairytale love story.”




Read romance online


On our website you can read books romance online without registration. Every day spent some time to find your new favourite book in the coolest library. Tablets and smartphones are the most-used devices to read electronic books. Our website is very easy to use. No need for registration. Access around the clock.
Let your romantic story begin with our electronic library.

Read books online » Romance » అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖

Book online «అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖». Author Bhimeswara Challa



1 ... 7 8 9 10 11 12 13 14 15 ... 21
Go to page:
అది వదలగానే మూడు సంవత్సరాల క్రితం నాకు కుష్టు వ్యాధి వచ్చింది. అది మనం అనగలిగే పరిస్థితికి తీసుకురావలనేదే నా ఆశయం. అసలు వీరికోసం ప్రత్యేకంగా కాలనీ వుంచటం మంచిది కాదు. అన్ని రోగాలతోపాటు దీనిని కూడా మామూలు ఆస్పతులలో ట్రీట్ చెయ్యాలి. లేకపోతే వారేదో అంటరాని వారని అనే భావం రోగులలో కలుగుతుంది. అది ఎంతమాత్రం మంచిది కాదు” అన్నాడు.

కమల: “అయితే మీరు దీనిని ఎందుకు స్థాపించలేదు'' అంది.

“ఇది నేను దిక్కులేని వారి కోసం పెట్టాను. వ్యాధి బాగుచేసే వారు లేక వీరు రోడ్ల వెంట తిరుగుతూ రోగాన్ని వీరు జీవనోపాధిగా చేసుకొని జీవిస్తూ వుంటారు. ఇంకొక కారణం కూడా వుంది. కుష్ఠు రోగి చాలా కాలం ఇంకొకరితో కలిసివుంటేనే వ్యాధి పాకుతుంది. భార్యాభర్తలని తల్లి పిల్లలను వేరుచేయరు, పుట్టుకతోనే ఈ వ్యాధి రాదు. కాని పుట్టిన తర్వాత ఎక్కువకాలం ఒకే ఇంటిలో జీవిస్తేనే యిది సోకుతుంది. అలా జరగకుండా వుండడానికే అలాంటి రోగులను వేరు చేసి యిక్కడకు తీసుకువస్తాము. ఇక్కడకు వచ్చిన తర్వాత తల్లిదండ్రలను పిల్లలనీ వేరు చేస్తాము. పేర్లు మారుస్తాము. కొద్ది కాలంపోయిన తర్వాత ఒకరి నొకరు గుర్తుకూడా పట్టలేరు. కాని మా వద్ద జాబితా వుంది, వ్యాధి పూర్తిగా నయమయి వెళ్ళే సమయంలో ఎవరి పిల్లలను వారికి అప్పగిస్తాము” అన్నాడు.

రజని: “విశాల మీకు నచ్చిందా డాక్టర్. ఆమె మనసత్వం యీ లాంటి పనికి సరిపోతుందా” అంది.

విశాల కాస్త చిన్న బుచ్చుకొని “నా ఎదుట అలాంటి ప్రశ్న వేస్తే ఆయన ఏం చేస్తారు రజనీ. నా శక్తి వంచన లేకుండా నేను కృషిచేస్తున్నాను. అయినా నేర్చుకోవలసింది, చెయ్యవలసింది చాలా వుంది” అంది.

డాక్టర్ సనల్ : “విశాల వచ్చిన తర్వాత ఈ కాలనీ రూపమే మారిపోయింది. అంతకి ముందరంతా, అనుచిత అశుభ, అల్లకల్లోలం వుండేది. పిల్లలంతా చిందరవందరగా తిరుగుతూ వుండేవారు. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు రోగులకుఆమె వద్ద అలవాటు యెక్కువ అయింది. మానవమాత్రురాలుకాదని వారిని వుద్ధరించడానికి వచ్చిన దేవత అని వారి నమ్మకం. ఆమె ముట్టుకుంటే బాధ ఉపశమనం అవుతుందనే భావం కూడా కుదిరింది” అన్నాడు.

“ ఫ్లారెన్స్నైటింగేల్ లాగ” అంది రజనీ.

కమలాకరం అక్కడకు వచ్చిన తరువాత నుంచి ఒక్కమాటకూడా మాట్లాడలేదు. డాక్టరు చెప్పినదంతా ఎంతో శ్రద్ధగా వింటున్నాడు.

“సాధారణంగా ఈ వ్యాధి కుదరటానికి ఎంత కాలం పడుతుంది డాక్టర్?” అన్నాడు.

“అదేవ్యాధి లేతవయస్సులో వున్నప్పుడయితే ఒక ఆరు నెలలలో పూర్తిగా నయమవుతుంది. వ్యాధి సోకిన వెంటనే అయితే ఒకటి రెండు నెలలలోనే నయమవుతుంది. కుష్టు రోగులలో రెండు తరగతులున్నారు. “లె ఫమింటిన్ , న్యూరలన్. మొదటితరగతిదే అంటు వ్యాధి. రెండవది కాదు'' అన్నాడు.

''మీ మాటలు విన్న తర్వాత మేము ఎంత అజ్ఞానంలో పడివున్నామో ఇప్పుడు అర్ధమయింది డాక్టర్. కుష్టు రోగమంటేనే శరీరం గగుర్పాటు వస్తుంది” అన్నాడు కమలాకరం.

డాక్టర్ సనల్ వీరందరిని రోగులవద్దకు తీసుకెళ్లాడు. కొంత మంది ఎంతో ఆరోగ్యంగా, అతి సాధారణంగా వున్నారు. రోగులని గుర్తుకూడా పట్టలేము. కాని అవన్నీ న్యూరల్ టిప్ తరగతివని అంటూ చెప్పేడు. కొంతమందికి వంటిమిద మచ్చలు తప్ప ఇంకేవిధమైన అంగవైకల్యం లేకుండా వున్నారు. వ్యాధి ఎంతో లేతవయస్సులో వుందని తప్పక నయమవుతాయని డాక్టర్ చెప్పాడు. కొంతమందికి చేతినిండా కురుపులు, దెబ్బలు కాల్పులు వున్నాయి. కారణమడుగుతే డాక్టర్ కుష్టురోగులకి కొంత కాలంపోయిన తరువాత స్పర్శాజ్ఞానం నశించిపోతుంది. వారికి నొప్పి, బాధ అనేవే తెలియవు, ఎంత మోటు పనైనా చేస్తారు. కత్తితో కోసి వేసినా వారికి బాధ తెలియదు. వీరంతా అలాంటి వారే. శక్తి సామర్థ్యాలకుమించి పనులు చేస్తూ ఇలాగయి పోతుంటారు” అన్నాడు.

“అయితే కుష్టురోగికి ఏవిధమైన బాధా వుండదా డాక్టర్?” అన్నాడు రామం.

“అదే ఎంతో దురదృష్టమయినది. మిగతా వ్యాథులన్నింటికి బాధ నొప్పి వుంటాయి. బాధ భరించలేక రోగులు త్వరగా డాక్టరు వద్దకు వస్తారు. దీనికి బాధవుండదు, అందుకని అందరు అశ్రద్ధ చేస్తారు అంగ వైకల్యము ప్రారంభమైనప్పుడే అందరు భయపడతారు. రహస్యంగా డాక్టరువద్దకు వస్తారు. కాని అప్పటికే చాలామట్టుకు మించిపోతుంది. ఐనా ఇంకా కొంతమంది సంఘానికి వెరచి డాక్టరువద్దకు రారు. ఒకాయన నాకు తెలుసు. చదువుకున్నాడు. సంస్కారి.దురదృష్టవశాత్తు వ్యాధిసోకింది. మొదలు గుర్తించలేదు. కొన్ని నెలలకు చేతుల వేళ్లు పోనారంభించాయి. అప్పుడు భయంతో చేతులకు గ్లవ్స్తొడుగుకొని తిరగటం ప్రారంభించాడు కాని నేను ఇతర గుర్తులను పసిగట్టి ఒక రోజున అడిగాను. నా ప్రశ్న విని భయంతో వణికిపోయి బయటకు పారిపోయి తిన్నగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి కుష్టు రోగం వచ్చినదనే విషయం సంఘానికి తెలుస్తుందేమోననే భయమే ఆ విచార పరిణామానికి దారితీసింది. ఇది ఏమి భయంకరమైనది కాదు. అనేక రోగాలలో ఇదోకటి మాత్రమే ఐనా సంఘం గుర్తించినప్పుడే ఆలాంటి వారికి ముక్తి వుందన్నాడు. ఆమెరికాలో 'లెప్పర్' అనే పేరు మార్చి వేసారు. పాన్ డన్స్ డిసీజంటారు” అన్నాడు.

రోగులంతా విశాలను, డాక్టరును చూచి సంతోషముతో వుప్పొంగిపోయారు. ఆమె అందరిని ఆప్యాయంగా పలకరించడం, కొంతదూరం పోయింతర్వాత రజని కూడా ఆమె ననుకరించి అందరిని పలకరించి వారి వారి వృత్తాంతాలను తెలుసుకొంది. కొద్ది కాలంలోనే వారితో స్నేహం చేసుకుంది. అది గ్రహించి డాక్టర్ సనల్ “మీరు రోగుల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకున్నారు. విశాలలాగే మీరు కూడా ఈ పనికి పూనుకుంటే కృతార్థులవుతారు” అన్నాడు.

“అవునని నాకు నమ్మకంగా వుంది డాక్టర్ నాకు అనుమతి ఇవ్వండి. నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా నాకు చేతనయినది నేను చెయ్యవచ్చునని” అంది.

“అంతకంటే మాకు కావలసిందింకేమి లేదు” అన్నాడు డాక్టర్

రజని మాటలు విని రామం ఆమె కేసి తీక్షణంగా చూచాడు. ఆమె నవ్వుతూ “కాని ఒక షరతువుంది డాక్టర్, మీరు ఆయన అనుమతి తీసుకోవాలి” అంది.

“వారి అనుమతి తీసుకోవలసింది మీరు నేను కాదు. అయినా మీకు వివాహం కాలేదని విశాల చెప్పింది'' అన్నాడు.

మందహాసం చేస్తూ “ఇప్పుడయిందని ఎవరన్నారు. చెప్పండి ఇదంతా కలికాలం. అపరిచితులుకూడా అధికారం చెలాయిస్తూంటారు. అబలలము. తలవొగ్గాలి” అంది.

రజనీ పరిహసిస్తోందని డాక్టర్ గ్రహించి “మీరు చాలా విచిత్రవ్యక్తులు. అసమాన్యులు“ అన్నాడు.

రజని తెలుగులో విశాలనుద్దేశించి “డాక్టరుకి వివాహమయిందా?” అంది.

“లేదు. వారిని పరిహసించకు రజనీ. వారు స్వార్థత్యాగులు, సంఘసంస్కర్తలు. పరులకష్టాలని తన కష్టాలుగా భావించే వుదారస్వభావులు” అంది.

“మాట్లాడేది నువ్వు కాదువిశాలా! నీలోని బలహీనత ” అంది రజని.

“ఇదన్యాయం నా యెదుట నాకు తెలియని భాషలో మాట్లాడడం” అన్నాడు డాక్టరు.

“అన్యాయమేమీ లేదు డాక్టర్. మీరు స్వార్థత్యాగులంటోంది విశాల నేను కాదన్నాను” అది రజని.

“మీరన్నదే నిజం ఇందులో స్వార్థత్యాగమేమి లేదు. నాకు ఎంతో మనశ్శాంతి, సుఖం ఆనందం యీపని లభింపజేసింది. నా కోసమేనేనీ పని చేస్తున్నాను. పూర్తిగా స్వీయసుఖం కోసం చేస్తున్నదే ఇదంతా” అన్నాడు డాక్టరు.

“స్వీయసుఖమే అయినా అది పరుల సుఖానికి దోహదమౌతుంది. అదెంతమాత్రం, స్వార్థపరత్వం కాదండి” విశాల.

“స్వార్థపరత్వమని నేననలేదు. మానవుడు తను చేసే ప్రతీ పనికి సుఖాన్ని కాంక్షిస్తాడు. ఒక్కొక్కప్పుడు శారీరకంగాను, ప్రాపంచికంగాను యితరులకోసమని మనల్ని మనం కష్ట పెట్టుకుంటాము. మనమేదో “త్యాగం చేస్తున్నామని భ్రమపడతాము నిజానికి నేను ఇతరుల కోసం ఈపని చేశానని మానసికతృప్తి కలుగుతుంది దానిని ఆశించే మనం ఆలా జేస్తాము” అంది రజని.

కమల; “మాటల్లో పడి మనష్యున్ని మరచిపోకు రజనీ తీరికగా మాట్లాడుకోండి-ఇప్పుడు కాస్తా యిదంతా చూద్దాం” అంది.

అంతా తిరిగి అలసి డాక్టరు పనిమిద వీరిని వదలి అవతలికి వెళ్ళిపోయాడు. అంతా కలిసి విశాల గదిలోకి వెళ్ళి కూర్చున్నారు.

రెండు మూడు నిమిషాల వరకు ఎవరు మాట్లాడలేదు. హఠాత్తుగా రామం “విశాలా! నీకు దైవంమీద నమ్మకముందా” అన్నాడు.

ప్రశ్న విని అందరు త్రుళ్ళిపడ్డారు. అంత ఆ సందర్భముగా ఉపోద్ఘాతం లేకుండా అలాంటి ప్రశ్న వేస్తాడని ఎవరు ఊహించలేదు. విశాలా క్షణం మౌనం వహించి “ఈ ప్రశ్నకు సమాధానం రజని చేప్తే ఎంతో సమంజసంగా వుంటుందేమో” అంది.

రజని“సమంజసమో, అసమంజసమో నాకు తెలియదు, విశాలా!కాని ఇది సమయం కాదు” అంది.

రామం కోపంతో “ఈ ప్రశ్న వేసింది. నిన్ను విశాలా? సమాధానం చెప్పవలసింది నీ కర్తవ్యం” అన్నాడు.

విశాల“చాలా కష్టమైన ప్రశ్న వేసారు మీరు. యీ ప్రశ్న మీరు ఎందుకు వేసారో నాకు తెలియదు.” చిన్నతనం నుంచి నా మనస్సులో ఒక కోరిక నిలిచిపోయింది. మానవ హృదయాలలో ఎంతో దుఃఖం కరడుగట్టి వుంది, ఎంతో బాధ, వేదన ప్రతిమానవుడు జీవితంలో అనుభవిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో పరుల కన్నీటిని తుడువ ప్రయత్నించటంకన్న ఇక వేరే కర్తవ్యమేముంది! అంతకుమించిన దైవం సృష్టిలో లేదు. వున్న వారితో నాకు పని లేదు. దైవమనే పేరుతో మట్టి బొమ్మల్ని రాత్రింబగళ్ళు పూజిస్తూ తోటిమానవున్ని అసహ్యించుకొని, వారి ఆక్రందాన్ని పెడచెవిని పెట్టువారికి అన్యాయం చేసేవారు ఆత్మవంచకులు అధమాధములు.మానవ సేవే మాధవ సేవఅనేదే పరమ సత్యం. మనము నిత్యము పారాయణ చేయవలసింది భగవద్గీత కాదు. ఈ చిన్న సూత్రమే” అంది.

మాట్లాడుతూ, మాట్లాడుతూ విశాల కాస్త ఉద్రేకపడింది. అది చూచి రామం ఆశ్చర్యపోయాడు. విశాల స్వభావానికి, నాస్తికత్వానికి అతనికేమి పోలికలు కనబడలేదు.

“అయితే దైవాన్ని విశ్వసించే వారంతా మూఢ విశ్వాసలేనా? వారిని అసహ్యించుకోవలసిందేనా” అన్నాడు బాధపడుతూ.

“లోపాలు లేని మానవులు లేరు రామం బాబు” బలహీనతకు బలాడ్యులు లేరు. కాని మనం ఇంకోరికన్నా గొప్పవారము,నైతికంగా ఉత్తములు అని విర్రవీగేవారిని మనం మనస్సులో వేరు చెయ్యాలి.

“కాని దైవాన్ని విశ్వసించే వారంతా నైతికంగా అధములు అనుకునే వారు కూడా అలాంటి వారేగా!” అంది కమల.

కమల ప్రశ్న విశాలకు చటుక్కుమని తగిలింది. క్షణకాలం మౌనం వహించి “నీఆభియోగానికి నేను కొంత వరకు తలవొగ్గాలి కమలా! కాని నేను నిశ్చయంగా చెప్పుతున్నాను. నా హృదయంలో అలాంటి భావానికి తావు లేదు, ఏమంటావు రజని” అంది.

రజని ఈ సంభాషణ అంతా ఎంతో కుతూహలంగా వింటూంది. రెండు మూడు సార్లు జోక్యం కలిగించుకుందామని ప్రయత్నించింది. కానీ ఎందుకో ఏమనాలో తోచలేదు. సృష్టిలోని ప్రతి విషయం గురించి ఆమె ఎంతో నిర్భయంగా,నిస్సంకోచంగా మాట్లాడుతుంది. కాని దైవం గురించి చర్చ వచ్చినప్పుడు ఆమె సాధారణంగా మౌనముద్ర వహిస్తుంది. కమల వేసిన ఆభియోగం, ఈమెకు కాస్త బాధ పెట్టింది. “నాకు దానితో ఏమి ప్రయోజనం లేదు విశాలా? నా బుద్ది కుశలత ననుసరించి నేను సమస్యలను ఎదుర్కొంటాను. నాకు ఇతరులతో సంబంధం లేదు. వారు దైవమయినాసరే; వరం కోసమని నేను యిహం వదలుకోను, దైవం కోసమని నాజీవితాన్ని నేను నాశనం చేసుకోను. క్షణక్షణము ఆనందంగా గడచిపోతుంటే అనంతమైన వాటిని గురించి మన మెందుకు అలోచించాలి” అంది.

రామం మెల్లగా “క్షణికంగా మనం చేసే పనులలో కొన్ని క్షంతవ్యం లేనివి వుంటాయనేదిరజనీ?”అన్నాడు.

రజనీ“క్షంతవ్యం కాదని నిరూపించే కొలత బద్ద” అంది.

రామం“దీనికి నమాధానం తెలియకే సతమతమవుతున్నాను రజనీ” అన్నాడు.

రజని“ఈ ప్రశ్నకు అనేకసార్లు మీకు నేను సమాధానం చెప్పేను. కాని మీమనస్సుని నమ్మించలేక పోయాను. కమలాకరం బుద్ధికుశలతలో మీకు నమ్మకముందని నాకు తెలుసు. ఈసారి వారికి సమాధానం చెప్పనీయండి” అంది.

కమలాకరం“ప్రశ్నను స్పష్టంగా వెయ్యి రజనీ ఆ తరువాత అందులోని గూడార్ధం తీస్తాను” అన్నాడు.

“జీవితంలో మానవుని కర్తవ్యం ఏమిటి? ఆత్మ ఎడ లేక ఆత్మీయుల ఎడ? ఒక వ్యక్తి మంచి చెడ్డలని నిర్ధారణ అధికారం ఇతరుల కెలా సంక్రమిస్తుంది! దానికి వెరచి మన మంతా ఎందుకు సంచరించాలి” అంది

“కర్తవ్యం ఆత్మీయుడే రజనీ! కాని యీఆత్మ ప్రబోధాన్ని అర్థం చేసుకోవడమే కష్టం ఆ శక్తి కరతలామల కమవుతే ఆ వ్యక్తి యితరుల గురించి ఆలోచించనక్కర లేదు” అన్నాడు.

కమలాకరం దృక్పధం ఎంతో నూతనంగా, సమంజసంగా అందరికి కనబడింది. కాని రజనీ అంగీకరించలేదు. “అవి ఆత్మవిశ్వాసం లేని వారనే మాటలు. నేనంగీకరించను, అప్పుడప్పుడు అస్పష్టంగా కనబడవచ్చు, కాని చెవివొగ్గి వింటేఅది స్పష్టంగానే వుంటుంది” అంది.

కమల“ఆలస్యమయింది. ఇక పోదాము. వ్యర్ధమైన యీ వివాదాలతో మనకయితే సరిపోతుంది. కాని విశాలకు చేతినిండా పనివుంది. వంట ప్రయత్నం కూడా ఏమి ప్రారంభించినట్లు లేదు” అంది.

విశాల“అది ఎంత సేపు కమలా.పది నిమిషాలలో అయిపోతుంది. మిమ్మల్నిందరిని భోజనానికి వుండమనే తాహతు నాకు లేదు. వుండమననుకూడాను” అంది

రజని“ఆ మిషతో మమ్మల్ని బయటకు పంపివేస్తున్నావు విశాలా? సరే; ఇదేమి ఆఖరుసారి కాదు” అంది.

అంతా కృత్రిమంగా ఒకసారి నవ్వారు. బయటకు వచ్చి వెళ్ళిపోయేముందు కమల; “ఇది నీ స్థిర నివాసమా, విశాలా? లేక అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూంటావా” అంది.

“లేదు, కమలా, ఇక నాకు దానితో పని లేదు. వీలున్నప్పుడల్లా మీరే ఇక్కడకు రండి, కుష్టు రోగం సోకుతుందనే భయం లేకపోతే” అంది.

కమల“నీకు లేని భయం మాకెందుకు విశాలా! అలాగే వస్తాము అని ఒక మాట చెప్తాను, కేవలం ఆత్మ సంతృప్తితో ఇహం లభించదు” అంది.

విశాల“ఇది నేనెప్పుడూ కాదనలేదు. కమలా - అయినా సమయానికి స్ఫురణకు రాలేదేమోననే ఆతురతతో చెప్పావు దానికి కృతజ్ఞరాలిని” అంది.

 

చాప్టర్ 9

చంద్రికకు కమలకు బాగా స్నేహమయింది. కమలకు చంద్రికను మొదట చూచినప్పుడే హృదయంలో ఆప్యాయత ఏర్పడింది. అదీ కాక ప్రసాద్ చెడు ప్రభావం వల్ల పెడదారులు తొక్కుతుందేమోనని భయపడింది కూడా తన పరిచయం ద్వారా ఆ ప్రమాదం నుంచి తప్పించుదామనుకుంది. చంద్రకతో అంత స్నేహం చేయడానికి కారణం ఇంకొకటి కూడా వుంది. అది కమల వొప్పుకోదు. అది హృదయాంతరాళంలో మెదిలే రహస్యపు ఆలోచన. అలాంటివి బాహ్యరూపంలో అగుపడవు. కానీ చేష్టల్ని ఆవి తీర్చిదిద్దుతునే వుంటాయి. చంద్రిక ప్రసాద్ తో కలిసి నివశిస్తోంది. ఆమె కంటే ఆప్తులు అతనికి ఎవరు లేరు. అతని రాకపోకలు, చేష్టలు అన్నీ ఈమెకు తెలుసును. మొదట నుంచీ ప్రసాద్ కమలకొక సమస్యగానే వున్నాడు. అతని స్వభావం ఆమె అర్థం చేసుకోలేక పోయింది. సాధారణ మానవకోటినుంచి ఆమడదూరంలో వున్న విచిత్ర వ్యక్తిగా ఆమెకు అగుపించాడు, అతనంటే ఒక విధమైన భయం ఏర్పడింది. అయస్కాంతంలాంటి ఆతని ఆకర్షణని ఆమె జయించ లేక పోయింది. ఇష్టానికి వ్యతిరేకంగా నే ఆమె అతనికి హృదయంలో చోటిచ్చింది. శతవిధాల శక్తినంతా కూడదీసి ప్రయత్నించినా కమల ఆ విశృంఖలాలనిత్రెంచలేకపోయింది. అప్పటిలో అంతర్యుద్ధం అంతమయినా విజయం ఆమెకు లభించలేదు, అయినా తన కర్తవ్యాన్ని గుర్తించింది. సాధ్యమయినంతవరకు ప్రసాద్ ని మరచి పోవాలని, అతనిని చూడకూడదని నిశ్చయించుకుంది. కాని మనస్సులో ప్రసాద్ సంగతులు తెలుసుకోవాలని, అతని అభిప్రాయాలు అర్ధం చేసుకోవాలని కోరిక మాసిపోలేదు. ప్రసాద్ కి సంబంధించిన ఏ వస్తువయినా ఆమెకొక విధమయిన ఆకర్షణ ఏర్పడింది. ప్రసాద్ అనేమాట వినినప్పుడల్లా ఆమె హృదయం ఒక్కసారిగా గగుర్పొడిచేది. చంద్రికకు అన్ని సంగతులు చెప్పేది ప్రసాద్ బయటకు కనబడినంత కఠిన హృదయుడు కాడని, ఉదార స్వభావుడని, ఆలోచన మనస్సులో మెల్లి గా జొరపడింది. చంద్రిక ద్వారా చంద్రిక లాంటి అనాధుల యెడ ప్రసాద్ కనబరచిన ఔదార్యం ఆమెలో ఒక విధమైన గౌరవం ఏర్పడడానికి కారణమయింది. అతని సాహసం. నిర్ణయత్వం, ఆమెలో ఒక విధమయిన ఎడ్మిరేషన్ ను ఏర్పరచాయి.కమలాకరం భార్య ఆలోచన కొంతవరకే గ్రహించగలిగాడు.స్త్రీల ఆలోచనల్ని పడగొట్టటం ఎంత కష్టమో అందరికి తెలుసు. వారి వారి హృదయాలలో రహస్యపు ఆలోచనల్నీ, యదార్థాల్ని గ్రహించడం చాలా దుర్లభమైనది . ఏ వ్యక్తియెడ మక్కువా మమత వున్నాయో, ఏ వ్యక్తి యెడ ఏవగింపు వుందో బాహ్యా చేష్టలనుంచి గ్రహించడం ఎండమావులను వెంటాడటం లాంటిది. కమలాకరానికి కమల ప్రవర్తనలో పెద్ద మార్పేమీ కనబడలేదు. మొదటి నుంచి ప్రసాద్ అంటే ఆమెకు కోపమనీ గ్రహించాడు, అతని విషయమేదైనా ప్రస్తావిస్తే ఆమె మాటలు తప్పించేది.

చంద్రిక తరచుగా కమల ఇంటికి వెళ్తూండేది. కాని కమల వొకసారికూడ చంద్రికను చూడడానికి పోలేదు. చంద్రికబలవంతంమీద వొకనాడు వెళ్ళటానికి ఒప్పుకుంది. కాని జాగ్రత్తతో ముందర ఒక మాట తీసుకొంది. ప్రసాద్ ఢిల్లీలో లేడని. ఇంకొక వారం రోజుల వరకు రాడని చంద్రిక చెప్పింది. అదే తగిన సమయమనుకుంది. ఆమె అంగీకారానికి ఇంకొక కారణం కూడా వుంది. ప్రసాద్ నివాసస్థలం చూడాలని ఒక విధమైన కుతూహలం ఏర్పడింది.

ఆ రోజు సాయంకాలం చంద్రిక వద్దకు బయలు చేరింది. కమలాకరం ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తానన్నారు. ఒంటరిగా బస్సు మీద బయలుదేరింది. అడ్రస్ తెలిసినా ఎంతో కష్టంమీద కాని యిల్లు గుర్తు పట్టలేకపోయింది. గుర్తుపట్టిన తర్వాత, అది కాదా అనే సందేహంలోపడింది. అంత పెద్ద భవనం ప్రసాద్ దా, ఎంత సుందరంగా వుంది? ఇంటి ఎదుట ఉద్యానవనం, కాని సందేహం లేదు. అదే వీధి అదే నెంబరు, భయపడుతూ, భయపడుతూ గేటు తీసి లోనికి వెళ్ళింది. వీధిగుమ్మం తెరచేవుంది. లోపల అలికిడి ఏమి లేదు. నెమ్మదిగా గుమ్మం వైపు నడుస్తూంటేవెనుక నుంచి “కమలా” అనే పిలుపు వినబడింది. అ గంభీర కంఠస్వరాన్నివెనుదిరుగకుండానే గుర్తు పట్టింది. క్షణకాలం శరీరoగగుర్పొడిచింది.నెమ్మదిగా వెనుదిరిగింది. ప్రసాద్ నవ్వుతూ నిలబడి వున్నాడు, చేతిలో మొక్కలకు నీళ్ళు పోసే క్యాన్ వుంది.

కమల: “మీరా?” అని మాత్రం అనగలిగింది.

“కాదు కమలా. తోటమాలిని. అయ్యగారు ఇంట్లో లేరు'' అన్నాడు నవ్వుతూ.

కమల ఛలోక్తికి నవ్వలేను. ప్రసాద్ ఇంటిలో వంటరిగా వున్నాడేమోననే భయంతో చంద్రిక లోపల లేదా?” అంది భయపడుతూ.

“కమలా, చంద్రిక వుంది. కాని నువ్వు వస్తున్నావని చెప్పలేదు. లేకపోతే బయటకు పంపించి వేసేవాడిని'' అన్నాడు ఇంకా నవ్వుతూ.

“అయితే లోపలకు వెళ్తా” నంది.

“ఇక పది పది హేను నిమిషాల వరకు నీకు చిక్కదు. కారణం చెప్పనంటే మొరటొడినంటావు. అయినా చెప్తాను. తలంటు పోసుకుంటోంది” అన్నాడు.

కమలకు చంద్రిక పై కోపం వచ్చింది తనను ఇంటికి పిలిచి చెయ్యవలసిన పనాయిది.

ప్రసాద్ “ఈ లోపున సహాయం చెయ్యాలి. పూల మొక్కలంటేనాకెంతో యిష్టం. ఎర్ర గులాబంటే నాకిష్టం లేదు. తెల్ల గులాబంటే నాకెంతో ప్రీతికాని స్త్రీలకుఎర్ర గులాబంటేనే ఇష్టం కదూ? అన్నాడు.

కమల“లేదు-గులాబీలంటేనే ఎక్కువ ఇష్టం లేదు. సంపెంగి, సన్నజాజి అంటే ఎంతో యిష్టం” అంది.

ప్రసాద్ “వాటిల్లో నిన్నాకర్షించేది సౌందర్యం కాదు కమలా, సువాసనమాత్రమే” నన్నాడు.

కమల“లేదు అది అసత్యం, సువాసనమైకంలో పడి మీరు, పురుషులు వాటి అందాన్ని గుర్తించరు. కొన్నిటిలోని అందాన్ని గుర్తించి సువాసనను చిన్న చూపు చూస్తారు. ఉంది.

“ప్రకృతిరీతే యింతే కమలా! ఈ రెండు సమపాళ్ళలో వున్న పుష్పాలు, పురుషులు అరుదుగా కనబడతారు. తలలో పెట్టుకోవడానికి తుంచే పుష్పాలకి సువాసన అవసరం. అయినా మీరు సువాసన లేని అందమైన పుష్పాలివి నిర్ధాక్షిణ్యంగా వదలి వేస్తారు. అవి ఎంత సోషిస్తాయో” అన్నాడు.

కమల“పుష్పవిలాపం వర్ణిస్తున్నారా” అంది.

ప్రసాద్“వల్లించడం లేదు కమలా నివేదించుకుంటున్నాను” అన్నాడు.

ఏ విషయం తప్పిద్దామని ఆమె విశ్వప్రయత్నం చేస్తూందో అది ప్రసాద్ నోటి వెంట వెలువడింది. కమల గుండె ఒక్కసారి వేగంగా స్పందించింది.

మాటలు తప్పిద్దామనే ఉద్దేశంతో: “చంద్రిక యింకా రావడం లేదేమి? లోపల వుందేమో” అంది.

“ఒక సమస్య నుంచి పారిపోయినంత మాత్రాన అది పరిష్కారం కాదు కమలా” అన్నాడు.

ఆ మాటలు కమలలోని పౌరుషాన్ని లేవదీశాయి “పారిపోవడం లేదు ప్రసాద్ - పోరాడుతున్నాను” అంది.

ప్రసాద్ పకపక నవ్వుతూ “ఈ విధంగానా? ముందర పరుగిడితే పారిపోవడమంటారు. వెనుక పరుగిడితే పోరాడడమంటారు. ఇంతేగా” అన్నాడు.

కమల కోపంతో“దుష్టులకు దూరంగా వుండడంలో పిరికితనం కాదు. అదే వివేకమంతమయిన యుద్ధం” అంది,

ప్రసాద్“దుష్టుడు అనేది నీనోట మాత్రమే కమలా. అది నీ హృదయపు అభిప్రాయమని నేను నమ్మను” అన్నాడు.

“అలా అనుకొనినిన్ను నీవే వంచించుకొంటున్నావు ప్రసాద్” అంది.

ఈసారి కమల మాటలు ప్రసాద్ కి నిజంగా కోపం తెప్పించాయి. అయినా తనను తాను తమాయించుకొని, “దుష్టుడనే కావచ్చు కమలా? కాని దుష్టులు ఆత్మీయులు కాకూడదా” అన్నాడు.

“సహృదయులు కాలేరు ప్రసాద్”.

“అయితే రజని సహృదయ కాదా?” అన్నాడు.

“రజని విషయంలో నేనే చెప్పలేను, అది స్వతసిద్దమైనదో కాదో నాకు తెలియదు. అయితే చంద్రిక కృతజ్ఞతా భావం మాత్రమే ప్రసాదు, అది స్వతసిద్దమయిన అనురాగమనీ ఆప్యాయతయని భ్రమవడుతుంది” అంది.

కమల కఠిన వాక్యాలు ప్రసాదుని కాస్త నొప్పించాయి. కమల వద్ద నుంచి కాస్త దూరంగా వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోస్తూ” మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తపడాలి కమలా? ఎక్కువ నీళ్ళు పోసినా ప్రమాదమే సంభవిస్తుంది” అన్నాడు.

ప్రసాదు మాటలని గూడార్థం కమల చూచాయగా మాత్రంగ్రహించింది.

“అది నిజమే ప్రసాద్! కాని ఇంకొక సామెత కూడా వుంది. పల్చటి మొక్కలే పెనుగాలికి తలవొగ్గి జీవిస్తాయి. ముదిరిన మొక్కలకు మరణమే గత్యంతరం” అంది.

ప్రసాద్ కి కమల కంఠస్వరం మాత్రమే వినబడింది. ఆమె ముఖం చూచినట్లయితే భయపడి వుండేవాడు... చంద్రిక అప్పుడే బయటకు వచ్చి కమలను చూచి చకితురాలైంది. “కమలా!?” అని పిలిచింది. కమల చంద్రికను గుర్తించి ప్రయత్నపూర్వకంగా నవ్వి “చంద్రిక ఎంత చక్కగా వున్నావు?”అంది. ప్రసాద్ కూడా లేచి నిలబడి చూచాడు. నిజంగా ఆమె ఎంతో చక్కగావుంది, పసుపు పచ్చ ఖద్దరు చీర

1 ... 7 8 9 10 11 12 13 14 15 ... 21
Go to page:

Free ebook «అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖» - read online now

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment